News

నోట్ల తిప్ప‌లు రాహుల్‌కి కూడా త‌ప్ప‌లేదు


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి కూడా పాత నోట్ల తిప్ప‌లు త‌ప్ప‌లేదు. నోట్ల మార్పిడి కోసం ఇవాళ రాహుల్ గాంధీ పార్ల‌మెంట్ వీధిలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లారు. అక్క‌డ భారీగా గుమ్ముకూడిన జ‌నం రాహుల్‌తో త‌మ బాధ‌లు చెప్పుకున్నారు. క‌స్ట‌మ‌ర్ల మొర ఆల‌కించిన రాహుల్ కేంద్ర ప్ర‌భుత్వం తీరు ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల బాధ‌లు తెలుసుకునేందుకు బ్యాంకుకు వ‌చ్చిన‌ట్లు రాహుల్ ఈ సంద‌ర్భంగా తెలిపారు. క్యూ క‌ట్టి .. పాత నోట్ల‌ను మార్చుకోనున్న‌ట్లు రాహుల్ చెప్పారు. నా ప్ర‌జ‌ల‌కు క‌ష్టం వ‌చ్చింది, వాళ్ల‌కు తోడుగా నేను ఉన్నాన‌ని కాంగ్రెస్ నేత అన్నారు. బ్యాంక్ కు వచ్చిన రాహుల్ తో అభిమానులు సెల్ఫీలు దిగారు.